పెట్టుబడిదారీ వ్యవస్థను కొమ్ము కాస్తున్న బిజెపి: ఉషా కిరణ్

61చూసినవారు
పెట్టుబడిదారీ వ్యవస్థను కొమ్ము కాస్తున్న బిజెపి: ఉషా కిరణ్
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశాన్ని దోచి పెట్టుబడిదారీ వ్యవస్థను పోషించి, రైతులకు మధ్యతరగతి ప్రజలకు నడ్డి విరుస్తుందని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ అధ్యక్షులు ఉషా కిరణ్ ఆరోపించారు. శనివారం ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య విలువలను బిజెపి పతనం చేస్తుందన్నారు. ఆదివాసి మహిళల అభివృద్ధి, మానవ హక్కుల కోసం పోరాడుతున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని ప్రజలను కోరారు.

ట్యాగ్స్ :