ప్రజావాణిలో అర్జీలను స్వీకరించిన కలెక్టర్

68చూసినవారు
ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కారమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజార్షిషా సూచించారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి అర్జీలను ఆయన స్వీకరించారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం ప్రజావాణి ప్రారంభమైన నేపథ్యంలో అర్జీదారులు బారులు తీరారు.

ట్యాగ్స్ :