ఎంఐఎం ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు ప్రారంభం

75చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో ఎంఐఎం పార్టీ పట్టణ అధ్యక్షుడు నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సలార్ మిలాత్ ఇంటర్ స్టేట్ క్రికెట్ టోర్నమెంట్ శనివారం నుండి ప్రారంభమైంది. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. సుమారు 32 జట్లు ఈ పోటీలు పాల్గొంటున్నాయని నజీర్ తెలిపారు. గెలుపొందిన జట్టుకు రెండు లక్షలు, రన్నర్ అప్ కు లక్ష నగదు బహుమతి అందజేయునున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్