తేనే టీగ‌ల దాడిలో గాయ‌ప‌డ్డ‌వారికి కంది ప‌రామ‌ర్శ‌

57చూసినవారు
తేనే టీగ‌ల దాడిలో గాయ‌ప‌డ్డ‌వారికి కంది ప‌రామ‌ర్శ‌
బేల మండ‌లం రేణిగూడ అట‌వీప్రాంతంలో తేనే టీగ‌ల దాడిలో గాయ‌ప‌డ్డ ఉపాధిహామీ కూలీలు జిల్లాకేంద్రంలోని రిమ్స్ ఆస్ప‌త్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీ‌నివాస‌రెడ్డి బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల‌తో క‌లిసి ఆస్ప‌త్రికి చేరుకుని అందుతున్న వైద్య చికిత్స‌ల‌పై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాల‌ని డాక్ట‌ర్ల‌కు కోరారు

సంబంధిత పోస్ట్