పీపీ పదవికి మేకల మధుకర్ రాజీనామా

83చూసినవారు
పీపీ పదవికి మేకల మధుకర్ రాజీనామా
మొదటి అదనపు జిల్లా కోర్టు, ఎస్సీ, ఎస్టీ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పని చేస్తున్న మేకల మధుకర్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీపీగా పని చేస్తున్న వారు రాజకీయ పార్టీల్లో పని చేయకూడదన్న నిబంధన మేరకు రాజీనామా చేసినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్