ఈద్గా మైదానాన్ని పరిశీలించిన అధికారులు

59చూసినవారు
ఈద్-ఉల్-ఫితర్ ప్రార్థనల కోసం ఈద్గాకు వచ్చే ముస్లీంలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపాలిటీ అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని సానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానంలో ఈద్ నమాజ్ ఏర్పాట్లను బుధవారం మున్సిపల్ సిబ్బందితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్