లబ్ధిదారులకు విద్యుత్ సౌకర్యం కల్పించండి

82చూసినవారు
ఆదిలాబాద్ రూరల్ మండలం భీంసారి గ్రామంలో 1996లో ఎస్సీ లబ్ధిదారులకు ఇచ్చిన వ్యవసాయ భూములలో వసతులు కల్పించాలని ఎంపీటీసీ బిక్కీ గంగాధర్ డిమాండ్ చేశారు. ఈ విషయమై జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్ ను శనివారం లబ్ధిదారులతో కలిసి వినతిపత్రం అందజేశారు. నీరు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తే మూడు పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. కావున అధికారుల స్పందించి సమస్యను పరిష్కారమే విధంగా కృషి చేయాలని విన్నవించారు

ట్యాగ్స్ :