ప్రారంభమైన రైల్వే ట్రాక్ మరమ్మత్తుల పనులు

76చూసినవారు
రైల్వే ట్రాక్ మరమ్మతుల కోసం ఆదిలాబాద్ పట్టణంలోని తాంసి రైల్వే గేటును మూసివేశారు. మంగళవారం రైల్వే ట్రాక్ మరమ్మత్తు పనులను రైల్వే అధికారులు ప్రారంభించారు. ఈ మేరకు సిబ్బందికి పలు సూచనలు చేస్తూ రైల్వే ట్రాక్ మరమ్మతులు చేపట్టారు. సెక్షన్ ఇంజనీర్ నరేష్ మాట్లాడుతూ ఈనెల 13 వరకు నిర్ణీత సమయంలో మరమ్మతు పనులు పూర్తి చేసి 14వ తేదీ నుండి యధావిధిగా రైల్వే గేటును తెరుస్తామన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్