ఆదిలాబాద్ కు చేరుకున్న సేవాదళ్ మహా పాదయాత్ర

65చూసినవారు
నార్నూరు మండలం దీక్ష భూమి నుంచి ప్రేమ్ సింగ్ మహారాజ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన సేవాదళ్ మహా పాదయాత్ర గురువారం సాయంత్రం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా యాత్రికులకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. వేలాదిగా సేవాలాల్ దిక్షదారులు ఈ యాత్రలో పాల్గొన్నారు. బంజారా పాటలపై నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. మహారాష్ట్రలోని పౌరగూడ వరకు పాదయాత్రగా దీక్షదారులు వెళ్తున్నారు.