విద్యార్థులు మూఢనమ్మకాలు తొలగించుకోవాలి

73చూసినవారు
విద్యార్థులు మూఢనమ్మకాలు తొలగించుకోవాలి
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గజిటెడ్ నంబర్ 1 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చెకుముకి మండల స్థాయి పరీక్ష ప్రశ్న పత్రాన్ని శనివారం డీఈవో ప్రణీత విడుదల చేసి పరీక్ష నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకొని మూఢనమ్మకాలు తొలగించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని అందుకు ఈ పరీక్ష దోహదపడుతుందని అన్నారు. జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు సంతోష్, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్