తేనెటీగల దాడిలో గాయపడ్డ కూలీలను పరామర్శించిన ఎమ్మెల్యే

66చూసినవారు
తేనెటీగల దాడిలో గాయపడిన బేల మండలం రేణుగూడా గ్రామ ఉపాధి కూలీలకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ వైద్య సిబ్బందికి సూచించారు. తేనెటీగల దాడిలో గాయపడిన వారిని ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో గురువారం బీజేపీ నాయకులతో కలిసి ఆయన ప్రామర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులను ప్రభుత్వ పరంగా సహాయం అందించి అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్