విద్యా హక్కు చట్టం ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలో నిరుపేద విద్యార్థులకు ఉచిత ప్రవేశాలు 25% కల్పించాలని తెలంగాణ మాదిగ జేఏసి జిల్లా అధ్యక్షుడు మల్యాల మనోజ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలో ఒకటవ తరగతిలో ఉచితంగా ప్రవేశాలు కల్పించుటకు సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేయాలని కోరారు.