బిజెపి ప్రభుత్వం ఏర్పాటులో యువకుల పాత్ర కీలకం

84చూసినవారు
బిజెపి ప్రభుత్వం ఏర్పాటులో యువకుల పాత్ర కీలకం
యువకులే పార్టీకు పట్టుకొమ్మలాంటి వారని బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపి ప్రభుత్వ ఏర్పాటులో యువకులే ప్రధాన భూమిక పోషించనున్నారని తెలిపారు. దేశ ఉజ్వల భవిష్యత్తుకై నరేంద్రమోదీని మరోసారి ప్రధాని చేయడమే లక్ష్యంగా పార్టీలోని యువకులు విస్తృతంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్