వాంకిడి: ప్రభుత్వ కళాశాలలో ఘనంగా 75రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
వాంకిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో 75 రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం ఇంచార్జి ప్రిన్సిపాల్ సురేందర్ ఆధ్వర్యంలోరాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రిన్సిపాల్ సురేందర్ మాట్లాడుతూ రాజ్యాంగం దేశ ప్రజల సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వానికి మద్దతు పలుకుతూ దారదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని గౌరవించడమే నిజమైన దేశభక్తి అని ఆయన అభిప్రాయపడ్డారు.