ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో ఆవు మృతి చెందిన ఘంటన కలకలం రేపుతోంది. మండలంలోని మర్లపెల్లి అటవి ప్రాంతంలో ఆవుపై గుర్తు తెలియని జంతువు దాడి చేసి చంపిన ఘటన స్థానికుల్లో భయాందోళన రేకెత్తిస్తోంది. ఆవును చంపింది పులి అని కొందరు స్థానికులు అంటున్నారు.
అటు ఆవుపై దాడి చేసింది చిరుతపులిగా ప్రాథమికంగా గుర్తించినట్లు అటవీ అధికారులు పేర్కొంటున్నారు. మొత్తానికి ఆవుపై దాడి చేసింది పులినా, లేదా చిరుతపులా అని నిర్ధారించేలా ఘటన స్థలాన్ని అటవి అధికారులు పరిశీలిస్తున్నారు.