ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన షేక్ ఇమ్రాన్ నేషనల్ క్రైమ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా నేషనల్ క్రైమ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సంస్థ చైర్మన్ అమాన్ గుప్తా, జాతీయ అధ్యక్షుడు సునీల్ కుమార్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేసినట్లు షేక్ ఇమ్రాన్ తెలిపారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.