తలమడుగు: ఆలయ నిర్మాణానికి రూ. 10లక్షలు, స్థలం విరాళం

69చూసినవారు
తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామంలో శ్రీ సీతా రామచంద్రుల ఆలయ నిర్మాణానికి పలువురు తమ వంతుగా విరాళాలు అందించారు. ఈ సందర్భంగా దాతలను గ్రామస్థులు శాలువాలతో సత్కరించారు. మెడిచల్మ స్వప్న స్మారకార్థం వారి మాతృమూర్తి రూ. 10. 20 లక్షలను విరాళం అందించారు.  సుదారపు రాములు స్మారకార్థం ఆయన కుమారుడు సుదారపు పోతన్న స్థలాన్ని విరాళంగా అందించారు. కార్యక్రమంలో మాజీ డైయిరీ ఛైర్మన్ లోక భూమారెడ్డి, తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్