కాళేశ్వరం జోన్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ డాక్టర్ బి. ప్రభాకర్ ను ఆదివారం శ్రీరాంపూర్ లోని సింగరేణి గెస్ట్ హౌస్ లో పర్యావరణ వేత్త గుండేటి యోగేశ్వర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతున్న ఏండ్ల నాటి మహా వృక్షాలను తొలగించవద్దని కోరారు. ట్రీ ట్రాన్స్ లొకేషన్ పద్ధతి ద్వారా వృక్షాలకు పునరుజ్జీవనం అందించాలని విజ్ఞప్తి చేశారు.