ప్రమాదవశాత్తు రైలు ఢీకొని తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మరణించినట్లు రైల్వే అధికారి మహేందర్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం, హమాలివాడ రైల్వే గేట్ వద్దకు ట్రాక్ వెంబడి నడుచుకుంటూ వస్తున్న గుర్తు తెలియని వ్యక్తిని సింగరేణి రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు.