మంచిర్యాల జిల్లా జన్నారంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చింతగూడ, పైడిపల్లి హనుమాన్ టెంపుల్ మధ్యలో ఉన్న ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి జన్నారం వైపు వెళ్తున్న ఓ కారు రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీరాంపూర్ కు చెందిన శ్రీపివాస్, రమేశ్, సాగర్ తీవ్రంగా గాయ పడినట్లు స్థానికులు తెలిపారు. గాయపడ్డ వారిని వెంటనే అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు.