ఆర్టీసీ సంస్థలో ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ సోమవారం ఆర్టిసి ఎండి సజ్జనార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జనక్ ప్రసాద్ మాట్లాడుతూ, యూనియన్ వ్యవస్థ ఆర్టీసీలో తీసుకు వస్తేనే కార్మికుల హక్కులు కాపాడిన వారమవుతామని పేర్కొన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.