వైద్య శిబిరాలను ఆదివాసి ప్రజలు వినియోగించుకోవాలని మంచిర్యాల ఏటిడిఓ పురుషోత్తం సూచించారు. జన్నారం మండలంలోని తపాలాపూర్ గ్రామంలో కొల్లం, ఆదివాసి, గిరిజనులకు ప్రధానమంత్రి జాతీయ ఆదివాసి న్యాయ మహా అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జన్నారం ప్రభుత్వ వైద్య సిబ్బంది సందీప్, కమలాకర్, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.