లోకేశ్వరం మండల పరిధిలో బతుకమ్మ, దుర్గా శోభయాత్రలకు ఎలాంటి డీజేలకు అనుమతి లేదని, ఎవరైనా నిబంధనలు అతిక్రమించి నట్లయితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్ఐ అశోక్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎవరైనా డీజేలు ఉపయోగిస్తే యాత్రకు సంబంధించిన వ్యక్తులపై, డీజేల యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలందరూ పోలీస్ వారికి సహకరించి శాంతియుత, ప్రశాంతమైన వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని కోరారు.