నిర్మల్ జిల్లా భైంసా గడ్డేన్న వాగు ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను అధికారులు ఆదివారం ఉదయం వెల్లడించారు ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 358. 70 మీటర్లు కాగా, ప్రస్తుతం 358. 70 మీటర్లు నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 100 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందన్నారు. మిషన్ భగీరథకు 20 క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేస్తున్నట్లు తెలిపారు.