ముధోల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన అభిషేక్ అనే విద్యార్థి జోనల్ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఆదివారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో బైంసాలో జరిగిన రెజ్లింగ్ అండ్-14, అండర్- 17 బాల బాలికల ఎంపిక పోటీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థి జోనల్ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఎంపికైన విద్యార్థిని ప్రధానోపాధ్యాయులతో పాటు పిడి శ్రీనివాస్ అభినందించారు. జోనల్ పోటీల్లో సత్తా చాటాలని ఆకాంక్షించారు.