అడవి కుందేళ్లు, కంజు పిట్టలను వేటాడుతున్న వేటగాళ్లను అరెస్టు చేసిన ఘటన నిర్మల్ పట్టణంలో శుక్రవారం జరిగింది. ఎఫ్ ఆర్ ఓ రామకృష్ణారావు తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్ పరిధిలోని అటవీ ప్రాంతంలో కుందేళ్లను, కంజు పిట్టలను వేటాడుతున్న నిందితులను పట్టుకొని 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. వన్యప్రాణులను వేటాడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.