నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జీ)లోని చాక్ పల్లి గ్రామంలో డీజిల్ దొంగతనం చేస్తూ ఓ మహిళ సీసీ కెమెరాకు చిక్కింది. గ్రామానికి చెందిన సురేశ్, సుధాకర్ తమ ఇంటి ముందు 3 రోజుల క్రితం ట్రాక్టర్లను పార్క్ చేశారు. శనివారం పని నిమిత్తం ట్రాక్టర్లను ఆన్ చేయగా స్టార్ట్ కాకపోవడంతో డిజిల్ చోరీ అయినట్లు అనుమానించారు. సమీప సీసీ కెమెరా చెక్ చేయగా ఓ మహిళ కారులో వచ్చి డిజిల్ చోరీ చేసినట్లు గుర్తించారు.