బిట్ కాయిన్ వ్యాపారం చేస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని టీజీవిపి రాష్ట్ర ఆర్గనైజర్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ విద్య బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే ఆర్థిక నేరాలకు పాల్పడితే విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళుతుందని మండిపడ్డారు. అలాంటి వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.