పరిసరాల పరిశుభ్రత వలనే ఆరోగ్యం: ఆర్పీఎఫ్ సీఐ శ్రీనివాస్ గౌడ్

75చూసినవారు
పరిసరాల పరిశుభ్రత వలనే ఆరోగ్యం: ఆర్పీఎఫ్ సీఐ శ్రీనివాస్ గౌడ్
స్వచ్చతా- హీ- సేవా కార్యక్రమంలో భాగంగా కాగజ్‌నగర్‌ ఆర్పీఎఫ్ సీఐ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రజలకు స్వచ్చతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్తానిక సర్దార్ భస్తిలోని యువతీ, యువకులకు, మహిళలకు స్వచ్చతపై సీఐ అవగాహన కల్పించారు. తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఎన్నో రోగాలను దూరం పెట్టవచ్చని, ఆరోగ్యంగా జీవించవచ్చని తెలిపారు. ఆర్పీఎఫ్ ఎస్ఐ ప్రాచీ దేవి, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్