సూర్యుడి అధ్యయనం కోసం ఆదిత్య ఎల్1 స్పేస్‌క్రాఫ్ట్‌ను ఇస్రో నింగిలోకి పంపిన విషయం తెలిసిందే. ఆ వ్యోమనౌకలో ఉన్న 2 రిమోట్ సెన్సింగ్ పరికరాలు సూర్యుడి ప్రకోపాన్ని చిత్రీకరించాయి. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఇస్రో సూర్యుడికి చెందిన ఫోటోలను రిలీజ్ చేసింది. ఆదిత్య ఎల్1లోని సోలార్ ఆల్ట్రా వాయిలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ పరికరాలు.. సూర్యుడిలో జరుగుతున్న పరిణామాలను పసిగట్టాయి. మే నెలలో ఆ చిత్రాలను తీసినట్లు ఇస్రో తెలిపింది.