ముంబైలోని తన ఇంట్లో నటుడు సైఫ్ అలీఖాన్ కత్తిపోట్లకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన్ను ఆసుపత్రికి తరలించగా వెన్నెముకలో 2.5 అంగుళాల కత్తి మొనను గుర్తించినట్లు లీలావతి ఆసుపత్రి డాక్టర్ నితిన్ డాంగే తెలిపారు. కత్తి వల్ల సైఫ్ వెన్నెముక నుంచి ద్రవం లీకైందని, కత్తి మొనను తొలగించి లీకేజీ ఆపేందుకు అతడికి శస్త్రచికిత్స చేశామని ఆయన వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.