TG: కల్లు సీసాలో కట్ల పాము ప్రత్యక్షం అవ్వడంతో కల్లు ప్రియులు ఖంగుతిన్నారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లిలో జరిగింది. కల్లు విక్రయించే దుకాణంలో ఓ వ్యక్తి కల్లు తాగుతుండగా సీసాలో కట్ల పాము పిల్ల కనిపించింది. వెంటనే సీసాను పడేయడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనతో ఆగ్రహించిన స్థానికులు కల్లు దుకాణాన్ని ధ్వంసం చేశారు.