ప్రస్తుతం మన దేశంలో హాట్ టాపిక్ మహా కుంభమేళా 2025. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మహా కుంభమేళాలో పాల్గొనేందుకు కోట్లాది మంది తరలివస్తున్నారు. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ కుంభమేళా జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. అయితే గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో తొలి 4 రోజుల్లో అమృత స్నానాలు ఆచరించిన వారి సంఖ్య 6 కోట్లు దాటిందని అధికారవర్గాలు పేర్కొన్నాయి.