మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలు.. రెండోసారి పరీక్ష తేదీ మార్పు

83చూసినవారు
మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలు.. రెండోసారి పరీక్ష తేదీ మార్పు
తెలంగాణ మోడల్‌ స్కూల్‌లలో ఆరో తరగతి ప్రవేశాలు మరియు 7, 8, 9, 10వ తరగతుల్లో బ్యాక్‌లాగ్‌ ఖాళీల భర్తీ కోసం నిర్వహించే అర్హత పరీక్ష తేదీని రెండోసారి మార్చారు. రాష్ట్రంలోని 194 మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష ఏప్రిల్‌ 27వ తేదీకి వాయిదా వేసినట్లు ప్రకటించారు. తొలుత ఏప్రిల్‌ 13న నిర్వహిస్తామని ప్రకటించి..ఇటీవల 20కి మార్చారు. ఈస్టర్‌ పండుగ నేపథ్యంలో పరీక్షను 27న నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్