ట్రినిడాడ్ పిచ్‌పై అఫ్గాన్ కోచ్ ఆగ్రహం

56చూసినవారు
ట్రినిడాడ్ పిచ్‌పై అఫ్గాన్ కోచ్ ఆగ్రహం
టీ20 ప్రపంచ కప్ తొలి సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా చేతిలో అఫ్గాన్ ఘోరంగా ఓడిన సంగతి తెలిసిందే. అయితే ట్రినిడాడ్ పిచ్ చెత్తగా ఉండటం వల్లే ఓడిపోయామంటూ ఆ జట్టు కోచ్ జొనాథన్ ట్రాట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మేం ఓడామని ఇలా అనడం లేదు. సెమీఫైనల్ వంటి మ్యాచ్‌కు ఇలాంటి పిచ్ సరికాదు. పోటీ న్యాయంగా లేదు. ఇద్దరికీ పిచ్ ఇబ్బందిగానే ఉంది. కానీ తొలుత మేం తక్కువ స్కోరు చేయడంతో సఫారీలకు విజయం దక్కింది’ అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్