టీచర్‌ను బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు యత్నం (Video)

76చూసినవారు
బీహార్‌లోని బంకా జిల్లాలో ప్రభుత్వ స్కూల్‌ టీచర్‌ను బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు ఒక యువకుడు ప్రయత్నించాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న ఒక మహిళ స్కూల్‌ తర్వాత తండ్రితో కలిసి బైక్‌పై ఇంటిని తిరిగి వెళ్తున్నది. కాగా, ముఖానికి ముసుగు ధరించిన సౌరభ్‌ వారిని అడ్డుకున్నాడు. నాటు తుపాకీతో బెదిరించి, బలవంతంగా మహిళ తలపై సింధూరం పెట్టాడు. ఆ యువకుడితో పాటు ఉన్న వ్యక్తి మొబైల్‌ ఫోన్‌లో దీనిని రికార్డ్‌ చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్