ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఉగ్రదాడుల మాటేమిటి..?: అజయ్‌ రాయ్‌

82చూసినవారు
ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఉగ్రదాడుల మాటేమిటి..?: అజయ్‌ రాయ్‌
జమ్మూకశ్మీర్‌లోని రియాసీలో యాత్రికులే లక్ష్యంగా బస్‌పై దాడి చేసిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని యూపీ కాంగ్రెస్‌ చీఫ్‌ అజయ్‌ రాయ్‌ డిమాండ్‌ చేశారు. ఈ ఘటనలో బస్‌ డ్రైవర్‌ సహా 9 మంది యాత్రికులు మరణించడంతో పాటు 33 మంది మరణించారు. ఈ ఘటనపై అజయ్ రాయ్ మాట్లాడుతూ..జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు చేసిన అనంతరం ఉగ్రవాదం సమసిపోయిందని చెప్పుకోవడం బీజేపీ నేతల ప్రచార ఆర్భాటమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్