బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ఇంటి వద్ద ఆందోళన

54చూసినవారు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ఇంటి వద్ద ఆందోళన
సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ఇంటి వద్ద డబుల్ బెడ్ రూం ఇళ్ల బాధితులు ఆందోళన చేపట్టారు. మారేడుపల్లి వద్ద ఇళ్లు ఇస్తామని డబ్బులు తీసుకుని మోసం చేశారని ఆరోపించారు. 30 మంది బాధితుల నుంచి డబ్బులు తీసుకొని ఇల్లు ఇవ్వలేదని, డబ్బులు తిరిగి చెల్లించాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. రూ.1.40 కోట్లు సాయన్నకు కూతుర్ల సమక్షంలోనే ఇచ్చినట్లు బాధితులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్