AI టెక్నాలజీ మిస్ యూజ్ కాకూడదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైటెక్స్‌లో జరుగుతున్న ఏఐ గ్లోబల్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని చెప్పారు. తెలంగాణ 11.3 శాతం వృద్ధిరేటు నమోదు చేసిందని తెలిపారు. అత్యాధునిక వసతులతో ఏఐ సీటీ విర్మిస్తామని, రాబోయే మూడేళ్లలో ఏఐ గ్లోబల్ హబ్‌గాా హైదరాబాద్ మారబోతున్నదన్నారు. తెలంగాణలో ఏఐ విస్తరణకు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు.