ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఎయిరిండియా

79చూసినవారు
ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఎయిరిండియా
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా తమ ఉద్యోగులకు వేతన పెంపు ప్రకటించింది. 2023 డిసెంబర్‌ 31 కంటే ముందు సంస్థలో చేరినవారికి ఈ పెంపు వర్తిస్తుంది. దీని ప్రకారం.. ఫస్ట్‌ ఆఫీసర్‌, కెప్టెన్ల వేతనం నెలకు రూ.5 వేలు మేర పెరగనుంది. కమాండర్ల వేతనం రూ.11 వేలు, సీనియర్‌ కమాండర్‌ వేతనం రూ.15 వేలు చొప్పున పెరగనుంది. జూనియర్‌ ఫస్ట్‌ ఆఫీసర్‌కు ఎలాంటి పెంపూ చేపట్టలేదు. అలాగే బోనస్‌ కింద రూ.1.8 లక్షల వరకు చెల్లించనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్