ఐశ్వర్యరాయ్ చేతికి గాయం.. వీడియో వైరల్

566చూసినవారు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కుడిచేతికి కట్టుతో కనిపించడంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఫ్రాన్స్‌లో జరుగుతోన్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఐష్ బుధవారం తన కూతురితో కలిసి బయల్దేరారు. ముంబై ఎయిర్‌పోర్టులో చేతికి కట్టుతో కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవ్వటంతో ఫ్యాన్స్ 'గెట్ వెల్ సూన్' అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఆమె గాయంపై స్పష్టత రావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్