మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబం పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం వరంగల్ లో సురేఖ దిష్టిబొమ్మను దహనం చేశారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. అక్కినేని కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని అన్నారు. మరోవైపు ఇదే అంశంపై సురేఖకు లీగల్ నోటీసులు ఇవ్వాలని నాగార్జున భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.