తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్టును సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. కుటుంబ వివరాల సేకరణను నేటి నుంచి ఈ నెల 7 వరకు చేపట్టనున్నారని, ఒకే రాష్ట్రం ఒకే కార్డు విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రేషన్, ఆరోగ్య సేవలతో పాటు సంక్షేమ పథకాలన్నీ కుటుంబ డిజిటల్ కార్డు ద్వారా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాగా, ప్రతి కుటుంబానికి ఒక ప్రత్యేక నంబరుతో కార్డు ఇవ్వనున్నారు.