అక్షయ్ కుమార్ తాజాగా నటించిన చిత్రం 'కేసరి చాప్టర్ 2'. ఈ చిత్రంలో శంకర్ నాయర్ పాత్రలో అక్షయ్ నటించారు. ఇటీవల హర్యానా పర్యటనలో శంకర్ నాయర్ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఈ క్రమంలో అక్షయ్ ఆ వీడియోను షేర్ చేస్తూ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. జలియన్ వాలాబాగ్ ఊచకోత తర్వాత బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన న్యాయవాది పాత్రలో అక్షయ్ ఈ చిత్రంలో కనిపించనున్నారు.