టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కుమారుడు తాజాగా బయట కనిపించాడు. అతడిని తల్లి రితిక ఎత్తుకొని ముంబై ఎయిర్‌పోర్ట్‌కి వచ్చారు. ఆ సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రోహిత్ కుమారుడు చాలా క్యూట్‌గా ఉన్నాడని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అతడి లుక్‌కి ఫిదా అయిన వారు ‘లిటిల్ హిట్‌మాన్’ అంటూ ప్రేమగా పిలుస్తున్నారు. రోహిత్ కుటుంబం సింపుల్‌గా కనిపించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.