హైదరాబాద్ కుషాయిగూడలో కిరాతక ఘటన వెలుగుచూసింది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు కమలను ఓ యువకుడు ఉరివేసి చంపాడు. అనంతరం మృతదేహంపై యువకుడు డాన్సులు చేశాడు. డాన్స్ చేస్తూ సెల్ఫీ వీడియోలు తీసుకొని స్నేహితులకు షేర్ చేశాడు. ఈ నెల 11న హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. వృద్ధురాలిని చంపి తాళం వేసి వెళ్ళిపోయాడు. దుర్వాసన రావడంతో స్థానికులు ఫిర్యాదు చేశారు. కాగా నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.