AP: ఇంటర్‌లో ఫెయిల్ కావడంతో ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విశాఖ జిల్లా రెడ్డి కంచరపాలెంకు చెందిన నిహారిక (17) నగరంలోని ఉమెన్స్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నారు. గత శనివారం విడుదల ఇంటర్ ఫలితాల్లో నిహారిక జువాలజీ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు. దాంతో మనస్తాపానికి గురైన నిహారిక సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.