CBIC ఏప్రిల్ 1 నుంచి ‘డిక్లేర్డ్ టారిఫ్’ విధానాన్ని తొలగించి, ‘సప్లై విలువ’ ఆధారంగా పన్నును లెక్కించనున్నారు. అంటే, ముందుగా ప్రచురించిన ఛార్జీలు కాకుండా నిజమైన లావాదేవీ విలువ ఆధారంగా GST విధిస్తారు. దీని ప్రకారం, గత ఆర్థిక సంవత్సరంలో హోటల్ గది అద్దె రూ. 7,500కు పైగా ఉన్నట్లయితే, ఇప్పుడు ఆ హోటల్ ‘Specified Premises’ కిందికి వస్తుంది. అటువంటి రెస్టారెంట్ సేవలు ఆటోమేటిక్‌గా 18% GST కిందకు వస్తాయి.