ఇకపై సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తు చేసే అభ్యర్థులు తమ వయస్సు, రిజర్వేషన్ కోటాకు సంబంధించిన పత్రాలు సమర్పించడం తప్పనిసరి. గతంలో ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన తరువాత మాత్రమే అభ్యర్థులు తమ వయస్సు, కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. మాజీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌పై ఆరోపణలు నేపథ్యంలో యూపీఎస్సీ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.