ALERT: మరో 2 గంటల్లో వర్షం

42898చూసినవారు
ALERT: మరో 2 గంటల్లో వర్షం
తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షం కురవనుందని HYD వాతావరణ శాఖ పేర్కొంది. ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం కురవనున్నట్లు పేర్కొంది. కొత్తగూడెం, జనగామ, MBNR, ములుగు, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, సంగారెడ్డి, VKB, వరంగల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వాన పడనున్నట్లు వెల్లడించింది. మరోవైపు పిడుగుపాటుకు వరంగల్, ఏటూరునాగారం, జనగామ జిల్లాల్లో ముగ్గురు రైతులు మృతి చెందారు.

సంబంధిత పోస్ట్